తెలంగాణ నర్సులకు ప్రతిష్టాత్మక అవార్డులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రానికి చెందిన పలువురు నర్సులు ‘నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ అవార్డు -2023’ను అందుకున్నారు. ది నేషనల్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ది న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కర్ణాటక సంయుక్తా ధ్వర్యంలో బెంగుళూరులో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పురస్కారాలను అందజేశారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌ హెడ్‌ నర్స్‌ ఆరోగ్య జ్యోతి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాల స్టాఫ్‌ నర్సు కట్కురి రాణి, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా వైద్యశాల స్టాఫ్‌ నర్స్‌ ఉపత్‌ ఉన్నీసా, కేర్‌ హాస్పిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ సంజుల వర్మ , హైదరాబాద్‌ సెయింట్‌ థెరిసా హాస్పిటల్‌ సిస్టర్‌ సరిత మేరీ పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. వ్యక్తిగతంగా చేసిన సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా నర్సులను అవార్డులకు ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు.

Spread the love