నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌కు మాతృ వియోగం

ప్రముఖ నిర్మాత, పీపుల్‌ మీడియా అధినేత టి.జి. విశ్వ ప్రసాద్‌ మాతృ మూర్తి టి.జి. గీతాంజలి (70) శుక్రవారం సాయంత్రం 6.10 నిమిషాలకు కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్‌ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడ దైవ దర్శనం అనంతరం, శుక్రవారం ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లల్లో నిర్మాత విశ్వప్రసాద్‌ పెద్దకొడుకు. వారణాసిలోనే ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్‌ అన్నారు.

Spread the love