తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన..

– 15 వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె..
నవతెలంగాణ – అశ్వారావూపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు(జేఏసీ) ఆధ్వర్యంలో స్థానిక మూడు రోడ్ల కూడలిలో గల తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేసారు. గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 15వ రోజుకు చేరింది. రోజు వారీ నిరసనలలో భాగంగా సమ్మె శిభిరం నుండి ర్యాలీగా వెళ్లి సమస్యలతో కూడిన వినతి పత్రన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి గ్రామపంచాయతీ కార్మికుల ( జేఏసీ )నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నదని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించే దిశగా అడుగులు వేయ కుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామపంచాయతీ కార్మికులందరూ తమ హక్కులను సాధించుకునే దానికోసం  పోరాటాలను ఉదృతంగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలైన పిఆర్ సిలో నిర్ణయించిన మినిమం బేసిక్ ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని, జీవో 60 ప్రకారం పంచాయతీ స్వీపర్లకు రూ.15 వేల 6 వందలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు యక్స్గ్రేషియా ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని కారో బార్ బిల్ కలెక్టర్ ను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుడి కి దహన సంస్కారాలు కు రూ.30 వేల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగ అవకాశము కల్పించాలని, ఇన్సూరెన్స్ పథకాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.