ద్విభాషా కథల బాల కథాకారుడు ‘పుల్లూరు జగదీశ్వర్‌ రావు’

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మలితరం బాల సాహిత్య వికాసకారుల్లో ఒకరుగా… రచయిత… అనువాదకులుగా తెలిసిన పేరు పుల్లూరు జగదీశ్వర్‌ రావు. అన్నింటికి దూరంగా… తన రచనలతో తానుగా మమైకమై నిలిచిన ఆయన తొలుత బాలలకు బోధకుడుగా నిరంతరం తన కథలతో వాళ్ళకు దగ్గరయ్యాడు. తరువాత ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నా తన బడి మూలాలను మరువకుండా బాల కథా యజ్ఞాన్ని కొనసాగించాడు. అందరిలా బాల సాహిత్య రచన చేస్తూనే తనదైన కోవలో భిన్నంగా రచనలు చేశాడు.
పుల్లూరు జగదీశ్వర్‌ కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌లో 4 జూన్‌, 1967 న పుట్టాడు. తల్లితండ్రులు శ్రీమతి పుష్పలీలా దేవి, శ్రీ దామోధరరావులు. విజ్ఞానశాస్త్ర విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా తనకు తెలిసిన శాస్త్రజ్ఞానాన్ని పిల్లలకు పాఠాలుగానే కాక కథలుగా అందించారు జగదీశ్వర్‌. వివిధ అంశాలపై యాభైకి పైగా సాధికారికమైన వ్యాసాలు రాసిన తన రచనల్లో ఎక్కువగా వైజ్ఞానికాంశాలకు పెద్దపీట వేశాడు. పంచాయత్‌ రాజ్‌ శాఖలో ఉన్నత ఉద్యోగిగా ‘పంచాయత్‌రాజ్‌’ పత్రికతో పాటు ఇతర పత్రికల్లో పంచాయత్‌రాజ్‌కు సంబంధించిన రచనలే కాక, విలక్షణ కథలు రాశాడు. ఇవేకాక ఎనభై తొంభయ్యవ దశకంలో సంపాదకులకు లేఖా రచయితగా వందలాది ఉత్తరాలు రాశాడు. తనకు తారసపడ్డ ప్రతి విషయాన్ని, అంశాన్ని అందులో రాశాడు జగదీశ్వర్‌. అప్పటి పత్రికా పాఠకులకు అవి సుపరిచితమే.
రచయితగానే కాక ఉద్యోగరీత్యా తన శాఖకు సంబంధించిన పలు అంశాలపై రచనలు చేసిన జగదీశ్వర్‌ వృత్తిరీత్యా తాను పాల్గొన్న కార్యశాలలు, వృత్యంతర శిక్షణల అనుభవసారాన్ని ‘ఎ ట్రైనీస్‌ వ్యూ ఆఫ్‌ ఎం.హెచ్‌.ఆర్‌.డి’ పేరుతో కూర్చాడు. వివిధ రూపాలు, ప్రక్రియల్లో రాసిన పుల్లూరు జగదీశ్వర్‌ రావు బాలల కథా సాహిత్యంలో చేసిన సంతకం రెండు భాషలది. తాను రాసిన తెలుగు, ఇంగ్లీష్‌ బాలల కథలను ‘లిటిల్స్‌’ బైలింగ్వల్‌ చిల్డ్రన్స్‌ స్టోరీస్‌ పేరుతో 2016లో అచ్చువేశాడు. తరువాత ఇదే కోవలో రెండు భాషల్లో తెచ్చిన పుస్తకం ‘చిలుక సాయం’ కథా సంపుటి.
నేను పైన చెప్పినట్టు విజ్ఞానశాస్త్ర విద్యార్థి అయిన జగదీశ్వర్‌రావు తన రచనలన్నింటిలో దానికి పెద్దపీట వేశాడు. తొలుత సైన్స్‌ ఉపాధ్యాయుడైనందున సైన్స్‌ పాఠాలను కథలుగా మార్చి బోధించాడు, అలాగే రాశాడు కూడా. తొలి సంపుటి ‘లిటిల్స్‌’ లోని కొన్ని కథలు అందుకు అక్షరోదాహరణగా నిలుస్తాయి. వాటిలో ‘సైన్స్‌ మాంత్రికుడు’, ‘తగినశాస్త్రి’, ‘గర్వభంగం’, ‘ఎడారి మొక్కలు’, ‘వన దేవత’, ‘గ్రహాల కథ’ వంటి వాటిని చూపించొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే బి.వి.ఎన్‌. స్వామి అన్నట్టు ఇవి ‘కరికూలం కథలు’ అన్నమాట. అన్నమాటే కాదు ఉన్నమాట కూడా. ఇంకా, ‘ఎందుకు? అనే ప్రశ్న పిల్లల నోట అలవోకగా వస్తుంది. పెద్దలు దాన్ని ఆచితూచి వాడుతారు. పిల్లలు ప్రశ్నిస్తూ తమ తార్కిక బుద్దికి పదును పెట్టుకుంటారు. ఆ సమయంలో పెద్దలు విసుక్కోకుండా వారికి తోడ్పడాలి. ఇందులోని ‘ఒంటె పరుగు’, ‘రెంటికి చెడ్డ రేవడి’ లాంటి కథలు పిల్లల జ్ఞాపకశక్తికి తోడ్పడడమేకాక ఆలోచింప జేస్తాయి కూడా. ఇందులోని ‘ఎడారి మొక్కలు’ (డిసర్ట్‌ ప్లాంట్స్‌) మొదలుకుని ‘నిన్ను నీవు తెలుసుకో’ (నో యువర్‌సెల్ఫ్‌) కథ వరకు ప్రతి తెలుగు కథకు ఆంగ్ల అనువాదం సంపుటిలో ఉంది. బాల్యంలో రచయిత బడిలో కథలు చదివినవాడు కదా, అందులో చందమామ వంటి పుస్తకాలు మన మీద వేసిన ముద్ర సాధారణమైంది కాదు. జగదీశ్వర్‌రావు కూడా ఇందులో ఆ కోవలో నీతి కథలను, జంతువులు పక్షుల పాత్రల కథలను కూడా రాశాడు.
ఇదే కోవలో జగదీశ్వర్‌రావు తెచ్చిన మరో బాలల కథా సంపుటి ‘చిలుక సాయం’, ఇది 2021లో వచ్చింది. రెండు భాషల విషయంలో పైన చెప్పిన పుస్తకానికి సంబంధించిన అన్ని లక్షణాలు ఈ సంపుటికీ ఉన్నాయి. ఇది పన్నెండు కథల సంపుటి. ఇందులోనూ నీతులు, జీవన రీతులతో పాటు ప్రాణులు, పశువులు, చెట్లు వంటి వాటిని గురించిన అనేక విషయాలు ఉన్నాయి. ‘జలకాలుష్యం’ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కథ. ఇంకా ఇందులో మానవీయ విలువలు, జీవకారుణ్యం వంటి వివిధ విషయాలు, అంశాలను రచయిత బాలలకు అవగాహన అయ్యేట్టు రాశాడు. ‘సహజీవనం’ కథ బాలలకు జీవకారుణ్యాన్ని పరిచయం చేచడమేకాక ఆలోచింపజేస్తుంది కూడా. ఇందులోనూ రచయిత స్వయంగా తన తెలుగు కథను ఆంగ్లంలో అనువాదం చేసి కూర్చారు. నేటి నూతన విద్యావిధానం 2020 ద్విభాషా పుస్తకాలను అందించాల్సిందిగా సూచనలు చేసింది. దీనికి నాలుగేళ్ళ ముందే పుల్లూరు జగదీశ్వర్‌ ఈ ద్విభాషా కథలు రాయడం విశేషం. తెలుగు బాల సాహిత్యానికి రెండు భాషల వెలుగులను అందిస్తున్న పుల్లూరు జగదీశ్వర్‌ రావు కు జయహో!పుల్లూరు జగదీశ్వర్‌ కరీంనగర్‌ జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌లో 4 జూన్‌, 1967 న పుట్టాడు. తల్లితండ్రులు శ్రీమతి పుష్పలీలా దేవి, శ్రీ దామోధరరావులు. విజ్ఞానశాస్త్ర విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా తనకు తెలిసిన శాస్త్రజ్ఞానాన్ని పిల్లలకు పాఠాలుగానే కాక కథలుగా అందించారు జగదీశ్వర్‌. వివిధ అంశాలపై యాభైకి పైగా సాధికారికమైన వ్యాసాలు రాసిన తన రచనల్లో ఎక్కువగా వైజ్ఞానికాంశాలకు పెద్దపీట వేశాడు. పంచాయత్‌ రాజ్‌ శాఖలో ఉన్నత ఉద్యోగిగా ‘పంచాయత్‌రాజ్‌’ పత్రికతో పాటు ఇతర పత్రికల్లో పంచాయత్‌రాజ్‌కు సంబంధించిన రచనలే కాక, విలక్షణ కథలు రాశాడు. ఇవేకాక ఎనభై తొంభయ్యవ దశకంలో సంపాదకులకు లేఖా రచయితగా వందలాది ఉత్తరాలు రాశాడు. తనకు తారసపడ్డ ప్రతి విషయాన్ని, అంశాన్ని అందులో రాశాడు జగదీశ్వర్‌. అప్పటి పత్రికా పాఠకులకు అవి సుపరిచితమే.
రచయితగానే కాక ఉద్యోగరీత్యా తన శాఖకు సంబంధించిన పలు అంశాలపై రచనలు చేసిన జగదీశ్వర్‌ వృత్తిరీత్యా తాను పాల్గొన్న కార్యశాలలు, వృత్యంతర శిక్షణల అనుభవసారాన్ని ‘ఎ ట్రైనీస్‌ వ్యూ ఆఫ్‌ ఎం.హెచ్‌.ఆర్‌.డి’ పేరుతో కూర్చాడు. వివిధ రూపాలు, ప్రక్రియల్లో రాసిన పుల్లూరు జగదీశ్వర్‌ రావు బాలల కథా సాహిత్యంలో చేసిన సంతకం రెండు భాషలది. తాను రాసిన తెలుగు, ఇంగ్లీష్‌ బాలల కథలను ‘లిటిల్స్‌’ బైలింగ్వల్‌ చిల్డ్రన్స్‌ స్టోరీస్‌ పేరుతో 2016లో అచ్చువేశాడు. తరువాత ఇదే కోవలో రెండు భాషల్లో తెచ్చిన పుస్తకం ‘చిలుక సాయం’ కథా సంపుటి.
నేను పైన చెప్పినట్టు విజ్ఞానశాస్త్ర విద్యార్థి అయిన జగదీశ్వర్‌రావు తన రచనలన్నింటిలో దానికి పెద్దపీట వేశాడు. తొలుత సైన్స్‌ ఉపాధ్యాయుడైనందున సైన్స్‌ పాఠాలను కథలుగా మార్చి బోధించాడు, అలాగే రాశాడు కూడా. తొలి సంపుటి ‘లిటిల్స్‌’ లోని కొన్ని కథలు అందుకు అక్షరోదాహరణగా నిలుస్తాయి. వాటిలో ‘సైన్స్‌ మాంత్రికుడు’, ‘తగినశాస్త్రి’, ‘గర్వభంగం’, ‘ఎడారి మొక్కలు’, ‘వన దేవత’, ‘గ్రహాల కథ’ వంటి వాటిని చూపించొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే బి.వి.ఎన్‌. స్వామి అన్నట్టు ఇవి ‘కరికూలం కథలు’ అన్నమాట. అన్నమాటే కాదు ఉన్నమాట కూడా. ఇంకా, ‘ఎందుకు? అనే ప్రశ్న పిల్లల నోట అలవోకగా వస్తుంది. పెద్దలు దాన్ని ఆచితూచి వాడుతారు. పిల్లలు ప్రశ్నిస్తూ తమ తార్కిక బుద్దికి పదును పెట్టుకుంటారు. ఆ సమయంలో పెద్దలు విసుక్కోకుండా వారికి తోడ్పడాలి. ఇందులోని ‘ఒంటె పరుగు’, ‘రెంటికి చెడ్డ రేవడి’ లాంటి కథలు పిల్లల జ్ఞాపకశక్తికి తోడ్పడడమేకాక ఆలోచింప జేస్తాయి కూడా. ఇందులోని ‘ఎడారి మొక్కలు’ (డిసర్ట్‌ ప్లాంట్స్‌) మొదలుకుని ‘నిన్ను నీవు తెలుసుకో’ (నో యువర్‌సెల్ఫ్‌) కథ వరకు ప్రతి తెలుగు కథకు ఆంగ్ల అనువాదం సంపుటిలో ఉంది. బాల్యంలో రచయిత బడిలో కథలు చదివినవాడు కదా, అందులో చందమామ వంటి పుస్తకాలు మన మీద వేసిన ముద్ర సాధారణమైంది కాదు. జగదీశ్వర్‌రావు కూడా ఇందులో ఆ కోవలో నీతి కథలను, జంతువులు పక్షుల పాత్రల కథలను కూడా రాశాడు.
ఇదే కోవలో జగదీశ్వర్‌రావు తెచ్చిన మరో బాలల కథా సంపుటి ‘చిలుక సాయం’, ఇది 2021లో వచ్చింది. రెండు భాషల విషయంలో పైన చెప్పిన పుస్తకానికి సంబంధించిన అన్ని లక్షణాలు ఈ సంపుటికీ ఉన్నాయి. ఇది పన్నెండు కథల సంపుటి. ఇందులోనూ నీతులు, జీవన రీతులతో పాటు ప్రాణులు, పశువులు, చెట్లు వంటి వాటిని గురించిన అనేక విషయాలు ఉన్నాయి. ‘జలకాలుష్యం’ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కథ. ఇంకా ఇందులో మానవీయ విలువలు, జీవకారుణ్యం వంటి వివిధ విషయాలు, అంశాలను రచయిత బాలలకు అవగాహన అయ్యేట్టు రాశాడు. ‘సహజీవనం’ కథ బాలలకు జీవకారుణ్యాన్ని పరిచయం చేచడమేకాక ఆలోచింపజేస్తుంది కూడా. ఇందులోనూ రచయిత స్వయంగా తన తెలుగు కథను ఆంగ్లంలో అనువాదం చేసి కూర్చారు. నేటి నూతన విద్యావిధానం 2020 ద్విభాషా పుస్తకాలను అందించాల్సిందిగా సూచనలు చేసింది. దీనికి నాలుగేళ్ళ ముందే పుల్లూరు జగదీశ్వర్‌ ఈ ద్విభాషా కథలు రాయడం విశేషం. తెలుగు బాల సాహిత్యానికి రెండు భాషల వెలుగులను అందిస్తున్న పుల్లూరు జగదీశ్వర్‌ రావు కు జయహో!
– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548 

Spread the love