రాహుల్‌ మాటలు అభ్యంతరకరం

– సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖమ్మం సభలో మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉన్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగంకు సాగునీటిని అందిస్తున్నదని గుర్తుచేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. స్థానిక నాయకులు రాసిచ్చిన అబద్దాల స్క్రిప్టును రాహుల్‌ గాంధీ చదివారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పింఛన్‌ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.పోడు భూముల గురించి అబద్దాలు మాట్లాడారని తెలిపారు.

Spread the love