బోధన్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన: రాజా గౌడ్ 

నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోగా రాజా గౌడ్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బోధన్ తహశీల్దార్ వరప్రసాద్, ఆర్.ఐ వరుణ్, ప్రభాకర్, సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు రెవెన్యూ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా రాజా గౌడ్ బాన్సువాడ ఆర్డీవోగా పని చేసి తాజాగా జరిగిన బదిలీల్లో బోధన్ కు బదిలీ పై వచ్చారు.