నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా వేద రజనీ సాయిచంద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లిలోని గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు. గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రజనీకి మంత్రి, ఎమ్మెల్సీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా వేద రజినిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సాయిచంద్ భార్య రజినికే ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో సాయిచంద్ భార్య రజనిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.