నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ యాక్ట్‌ నమోదు

– దుకాణాల లైసెన్సును రద్దు చేయాలి
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ చట్టాన్ని నమోదు చేసి దుకాణాల లైసెన్సును రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మాడ్గు ల్‌ చిట్టెంపల్లి డీపీఆర్‌ సిభవన్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పి.సునీతా మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి, జెడ్పి డిప్యూటీ సీఈవో సుభాషిని, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజరు కుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవా లని ఫర్టిలైజర్‌ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ లు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సోయాబీన్‌ పంటలకు అనుకూలమైన వా తావరణం ఉందని, పంట సాగుపై రైతులకు అవగా హన కల్పించాలని రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పంటల సాగుపై సలహాలు సూచన లు అందించాలన్నారు. రెండవ విడతలో భాగంగా దళితబంధు కింద నియోజకవర్గానికి 1100 చొప్పు న లబ్దిదారులను ఎంపిక చేయనట్లు, ప్రభుత్వ ఆదే శాల అందిన పిదప ఎంపిక ప్రక్రియను నిర్వహిం చినున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలం నేపథ్యం లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసు కొని సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని తాగునీరు కలుషితం కాకుం డా ఎప్పటికప్పుడు పైపు లీకేజీ పనులను సరిచేయా లని మంత్రి తెలిపారు. భోజన పథకంలో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించని పక్షం లో ఏజెన్సీలను తొలగించాలని మంత్రి డీఈఓను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్య భారీగా తగ్గిన తరుణంలో ప్రజా ప్రతినిధుల, స్థానిక నాయకుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలో ఉత్తీర్ణ త శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచిం చారు. ఆర్వో నీటి కంటే భగీరథ నీరు స్వచ్ఛమైన దనే విషయాన్ని ప్రజలకు తెలుపుతూ భగీరథ తాగు నీరుపై అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పి.సునీతా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యామ్నాయ పం టలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఖరీఫ్‌ లో లోటు వర్షపాతం నమోదు ఆందోళన కలిగిస్తుందని, రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేయడం జరు గుతుంది, ఎలాంటి పంటలు సాగు చేయాలో రైతు లకు తెలపాలని వ్యవసాయ శాఖ అధికారులకు జెడ్పీ చైర్పర్సన్‌ సూచించారు. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికా రులు పాల్గొన్నారు.