నవతెలంగాణ -డిచ్ పల్లి
రాంపూర్ నుండి మల్లాపూర్ వరకు బిటీ రాహదరి పునరుద్ధరణ చేయడానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల ను ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంజూరు చేయడం పాట్లా ఇందల్ వాయి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునథన్ రాము మాట్లాడుతూ.. డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి నుండి ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామం వరకు ఉన్న బిటి రోడ్డును పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకొని వేళ్ళడం జరిగిందని దానిలో భాగంగానే 2కోట్ల నలభై లక్షలు మంజూరు చేశారని,ఈ రోడ్డు నుండి డిచ్ పల్లి,ఇందల్ వాయి, దర్పల్లి మండలాలకు రాకపోకలు సాగించే వారికి దురబారంతో పాటు సమయం కుడా దక్కుతుందని ఎన్నో ఏళ్లుగా జరగని పనులు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చోరవతోనే సద్యమైతుందని వారన్నారు.విన్నవించుకున్న ప్రతి పనికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంజూరు చేయడం తమందరము రుణపడి ఉంటామని, గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.