మాసబ్‌ చెరువును కాపాడాలని వినతి

నవతెలంగాణ-తుర్కయాంజల్‌
తుర్కయాంజల్‌ పరిధిలోని మాసబ్‌ చెరువును కబ్జాదారుల నుండి రక్షించాలని కోరుతూ తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ అఖిలపక్షం నాయకులు శుక్రవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మెమోరాండం అందజేశారు. స్పందించిన ఎంపీ మాట్లాడుతూ ఏది ఏమైనా చెరువును కబ్జాదారుల నుండి రక్షిస్తానని హామీనిచ్చారు. రెండు రోజుల్లో తానే స్వయంగా చెరువును సందర్శించి..అక్రమార్కుల పని పడతానని అన్నారు. ఎంపీని కలిసిన వారిలో ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్‌, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బచ్చిగళ్ళ రమేష్‌, తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొశిక ఐలయ్య, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కళ్యాణ్‌ నాయక్‌, కౌన్సిలర్‌ కొండ్రు మల్లేష్‌, టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రావుల విరేశం, తుర్కయాంజల్‌ బీఎస్‌పీ అధ్యక్షుడు వద్దిగళ్ళ బాబు, నాయకులు పుల్లగురం విజయానంద్‌ రెడ్డి, కొంతం యాదిరెడ్డి రెడ్డి, గుత్తా మహేందర్‌ రెడ్డి, గుడ్ల అర్జున్‌, బొక్క వంశీధర్‌ రెడ్డి, మైలారం బాబు, అజరు, భూపాల్‌ రెడ్డి, కుమార్‌ గౌడ్‌, మల్లెల ఉపేందర్‌లు ఉన్నారు

Spread the love