సచివాలయంలో మీడియాపై ఆంక్షలతో సర్కారుకే నష్టం

– ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కొత్త సచివాలయంలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు తొలుత ప్రజలు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయని ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు కే. శ్రీనివాస్‌ వాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రెండో సంవత్సరం పీజీ జర్నలిజం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో మీడియాని అనుమతించకపోవ డంపై కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నా, జరగా ల్సిన స్థాయిలో చర్చ జరగడం లేదన్నారు. ఇందిరా పార్క్‌ లోని ధర్నాచౌక్‌లో నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిషేధం విధించినా కొద్ది మందే స్పందించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా అవసరం ఉంటుం దనీ, అధికారంలోకి వచ్చాక దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. ఏక మార్గంలో ప్రభుత్వం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పత్రికలు ప్రచురించాలని ప్రభుత్వాలు కోరుకుం టున్నాయనీ, మీడియా ప్రభుత్వం నుంచి సమాచారాన్ని రాబట్టుకోకుండా దారు లు మూసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వానికి వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉండదనీ చివరకు ప్రభుత్వమే నష్టపోవాల్సి ఉంటుంద న్నారు. నేటి జర్నలిజం కోర్సులు, జర్నలిజం వత్తి మధ్య పొంతన లేకుండా పోయిందనీ, కోర్సులను నవీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విభిన్న ప్రసార మాధ్యమాలకు రాసే విధంగా నైపుణ్యాలను సంపాదించు కోవాలని విద్యార్థులకు సూచించారు. వార్తాసేకరణ, రచన, ప్రజా సంబంధాలు, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ తదితర రంగాల్లో జర్నలిజం విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్‌ మీడియా కీలకంగా మారిం దనీ, అందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగు ణంగా మార్పులను అవగాహన చేసుకుని మన నైపుణాన్ని పెంచు కోవాలని సూ చించారు. జర్నలిజం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నల కు సమాధానం ఇచ్చా రు. విశిష్ట అతిథిగా సాక్షి చీఫ్‌ కార్టూనిస్టు శంకర్‌ మాట్లాడుతూ కార్టునిస్టులకు మీడియాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ నేపథ్యంలో వారికి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచిం చారు. జర్నలిస్టులతో పాటు కార్టూనిస్టులు కూడా విస్త్రృతంగా పుస్తక పఠనం చేయాలనీ, ఇందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని కోరారు. బొమ్మలు గీయడం బాగా వచ్చినా, రాజకీయ అవగాహన లేకుం టే కార్టూనిస్టులుగా రాణించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ కార్య క్రమంలో వర్సిటీ జర్నలిజం శాఖ అధిపతి మారుపు వెంకటేశం, అధ్యాప కులు సుధీర్‌ కుమార్‌, రామాంజని కుమారి, హసీనా ప్రసంగించారు.

Spread the love