నవతెలంగాణ-గోవిందరావుపేట
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బాలల సదనం పునః ప్రారంభించబోతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ని అనాథ బాలికలు, పాక్షిక అనాథ బాలికలు, మధ్యలోనే చదువు మానేసిన బాలికలు ప్రవేశాల కొరకు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇట్టి బాల సదనం నందు చేరిన బాలికలకు విద్య తో కూడిన బోజన, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. బాల సదనం లో చేరుటకు 6 సం ల నుండి 18 సం ల మధ్య వయస్సు కలిగిన బాలికలు అర్హులని తెలిపారు. ఇందులో ప్రవేశాల ప్రక్రియ కి సంబంధించి న సమాచారం కొరకు 9704506610,8500604902 నెంబర్లకి ఫోన్ వివరాలు పొందవచ్చని సూచించారు.