జిపి కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో గురువారం అఖిల రాజకీయపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు మండల పార్టీ అధ్యక్షులు పాల్గొనగా  గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, బిల్ కలెక్టర్లను కారోబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని, కనీస వేతనం 19వేల రూపాయలుగా ఇవ్వాలని స్వీపర్లకు 15,600 వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందితే వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే కనీసం చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించకపోవడం దురదృష్టకరమని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వీధులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.ఈ సమావేశంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు మద్దినేని త్యాగరాజు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ. సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు  తీగల ఆది రెడ్డి . ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ ఇరుగు పైడి మాదిగ . బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు సంఘీ శివ, టిడిపి పార్టీ మండల అధ్యక్షులు జె. సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి స్వప్న . గ్రామపంచాయతీ యూనియన్ జేఏసీ మండల అధ్యక్షులు తండ కుమార్  ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు సిబ్బంది సతీష్ రాజు సమ్మక్క విజయలక్ష్మి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.