నెయ్యి కోసం వెబ్‌షాపింగ్‌ పేజీ ఆవిష్కరించిన సిద్స్‌ ఫార్మ్‌

– భారతదేశ వ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాలలో ఐదు ప్రీమియం వేరియంట్లలో ఈ నెయ్యి లభ్యం
నవతెలంగాణ – హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ (డీ2సీ) డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, తమ సుపరీయర్‌ నాణ్యత ఉత్పత్తులకు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ సంస్థ ఇప్పుడు అతి సున్నితమైన నెయ్యి కలెక్షన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘సిద్స్‌ ఫార్మ్‌ నెయ్యి విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు లోని మా వినియోగదారులు ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు దీనిని చేరువ చేస్తున్నాము. ఈ ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియ అంతటా మా బృందం అత్యున్నత ప్రమాణాలను అందుకునేలా ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దడంతో పాటుగా రుచి పరంగానూ అమోఘంగా ఉండేలా రూపొందించారు. మా వెబ్‌సైట్‌పై నూతన షాపింగ్‌ పేజీ ద్వారా దాదాపుగా భారతదేశం లో అన్ని ప్రాంతాల నుంచి ఆర్డర్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. సిద్స్‌ ఫార్మ్‌ నెయ్యి ప్రతి వంటగదిలోనూ తప్పనిసరిగా ఉండే నెయ్యిలా నిలుస్తుందని ఆశిస్తున్నాము. అసాధారణ నాణ్యత, వైవిధ్యమైన రుచితో, కలినరీ అనుభవాలను వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మా విలువైన వినియోగదారులకు ఎన్నటికీ నిలిచి ఉండే రుచులను సృష్టించనున్నాయిఋా’’ అని అన్నారు. సిద్స్‌ ఫార్మ్‌ నెయ్యిలో విభిన్నమైన వేరియంట్స్‌ ఉన్నాయి.
వీటిలో ఆవు నెయ్యి (350 గ్రాముల ప్యాక్‌ 500 రూపాయలు) ; గేదె నెయ్యి (350 గ్రాముల ప్యాక్‌ 400 రూపాయలు (డిస్కౌంట్‌ తరువాత), దేశీ ఆవు నెయ్యి ( 350 గ్రాముల ప్యాక్‌ ధర 750 రూపాయలు (డిస్కౌంట్‌ తరువాత), ఆవు నెయ్యి ట్రావెల్‌ ప్యాక్‌ (500 గ్రాముల ప్యాక్‌ 650 రూపాయలు) , గేదె నెయ్యి ట్రావెల్‌ ప్యాక్‌ (500 గ్రాముల ప్యాక్‌ 550 రూపాయలు).

Spread the love