కిషన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నల్ల గుడ్డలతో మౌన దీక్ష..

నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా గురువారం గోవిందరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు నల్ల గుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మద్దిలేని పెదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. ఎంత నిర్బంధం విధిస్తే అంతగా బీజేపీ ప్రజల్లోకి వెళుతుందన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బైరి మహేందర్ రెడ్డి, స్వప్న, కుసుమ భారతి, మందాటి పుష్ప, పేరాల ప్రేమలత, కుసుమ కిషోర్, ఎలగందుల రవీందర్, మెరుగు సత్యనారాయణ, ఏ సత్యనారాయణ రెడ్డి, కడారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.