– ఆత్మ చైర్మన్ రమణయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య,
– శాల్వాలతో ఎస్సై వెంకటేశ్వరరావుకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఎస్సై చావళ్ళ వెంకటేశ్వరరావు సేవలు మరువ లేనివని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య లు అన్నారు. శుక్రవారం బదిలీపై వాజేడుకు వెళ్తున్న ఎస్సై వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి, మొక్కను అందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మండలంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా చాకచక్యంగా తనదైన శైలిలో వ్యవహరించి మండల వ్యాప్తంగా శాంతిభద్రతలు కలిగించారని కొనియాడారు. మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వహించి, అధికారుల, భక్తుల, ఆదివాసీల మన్ననలు పొందారని తెలిపారు. ఎస్సైగా విధులు నిర్వహించిన వెంకటేశ్వరరావు మండల ప్రజలు యువత రాజకీయ నాయకులు అధికారులు వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి న్యాయం చేసే వాడిని తెలిపారు. మండల వ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఎస్ఐ వెంకటేశ్వరరావు బదిలీపై వెళుతుండడంతో మండల వాసులు బాధను వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రజలకు మంచి సేవలు అందించిన వ్యక్తి ఎస్సై వెంకటేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిసిసి డైరెక్టర్ పులుసుం పురుషోత్తం, మాజీ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, ముండ్రాతి రాజశ్రీ, బండారి చంద్రయ్య, సర్పంచులు, నాగేశ్వరరావు, గౌరమ్మ, గుర్రం రమాసమ్మిరెడ్డి, శ్రీధర్, చిడం బాబురావు, ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, కాయితి లింగచారి, శివరాజ్ నాగక్క, మైనార్టీ నాయకుడు రఫిక్, వసంతరావు, రంగు సత్యం, విక్రమ్, బందెల తిరుపతి, రజాక్, ముండ్రాతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.