కార్పొరేట్ కు దీటుగా దూసుకెళుతున్న సెయింట్ ఆంటోనీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్

– విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడమే మా పాఠశాల లక్ష్యం,
– ఏసి క్యాంపస్ తో డే అండ్ రెసిడెన్షియల్ పాఠశాల సౌకర్యం కలదు.
– అందమైన ప్రకృతి ఒడిలో విశాలమైన ఆట స్థలం మా క్యాంపస్ సొంతం,పాఠశాల కరస్పాండెంట్ రాజారపు ప్రభుదేవ్
నవతెలంగాణ-ధర్మసాగర్
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సామాన్యులకు సైతం అతి చేరువలో ఉన్న సెయింట్ ఆంథోనీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని పాఠశాల కరస్పాండెంట్ రాజారపు ప్రభుదేవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కరుణాపురంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ తో పాటు ముందుకు దూసుకెళ్తున్న సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీనియర్ ఫ్యాకల్టీచే విద్యాబోధన అందిస్తూ, డే అండ్ రెసిడెన్షియల్ ఏసీ క్యాంపస్ తో అందుబాటులో ఉందని తెలిపారు. విద్యార్థులకు అత్యాధునికమైన విశ్లేషకుల అధ్యాపకులచే విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. ప్రకృతికి సాహజ సిద్ధంగా విశాలమైన ఆట స్థలం కలిగి ఉండి అహ్లాదమైన వాతావరణంలో నెలకొల్కబడిన సెయింట్ ఆంథోనీ స్కూల్లో చేరితే విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి నాణ్యమైన విద్యను అందించి అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేసి వారి బంగారు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే మా పాఠశాల లక్షంమ ని అన్నారు. విశాలమైన సౌకర్యవంతమైన డిజిటల్ తరగతి గదులు, విద్యారంగంలో సమాచార, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలన్నా, మీ యొక్క పిల్లలకు బంగారు భవిష్యత్తు నిర్మించడానికై సెయింట్ ఆంథోనీ పాఠశాల సంసిద్ధంగా ఉందని తెలిపారు.క్రీడారంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రా స్థాయిలో సెలెక్ట్ అయ్యారని ఆటలతో పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ కూడా పాఠశాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం డాక్టర్లు,ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారని తెలియజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాజారావు అనూష, ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love