స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభం..

నవతెలంగాణ-భిక్కనూర్ : కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి ఆర్థిక సహకారంతో స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని బిజెపి నాయకులు తెలిపారు. మండలంలోని అంతంపల్లి గ్రామంలో గల మాల సంఘం భవన నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణం కోసం వెంకట రమణ రెడ్డి 2 లక్షల 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని ఈ సందర్భంగా మాల సంఘం ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్, జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి, గోల్కొండ నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, రాజయ్య, సాయిరెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.