రేపు హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు : వ్యకాస

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ, పట్టణ పేదలకు ఉపాధి పనులను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్టు గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె కాంతయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్‌ బాలమల్లేష్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సుకు రాజ్యసభ సభ్యులు వి శివదాసన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌పాషా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎన్‌ పాల్‌, ఆకునూరి మురళి, పీఎంసీ జాతీయ కార్యదర్శి బిడిఎ సత్యబాబు బోసు, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌ తదితరులు హాజరవుతారని తెలిపారు.
వ్యవసాయ కార్మికులు పెద్దసంఖ్యలో హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love