విద్యారంగ సమస్యలపై సమీక్ష లేని రాష్ట్ర ప్రభుత్వం

– హుస్నాబాద్ కు చేరిన ఎస్ ఎఫ్ ఐ  సైకిల్ యాత్ర

– జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్, ప్రశాంత్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
విద్యారంగంలో ఉన్నా సమస్యల పై విద్యాశాఖ ,రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయకపోవడం, ఎన్నికల పట్ల ఉన్న శ్రద్ధ కనీసం విద్యారంగం పైన లేకపోవడం విడ్డూరంగా ఉందని సిద్దిపేట జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రెడ్డమైన అరవింద్ దాసరిప్రశాంత్ లు అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ లకు రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చెప్తుందని ఎస్ ఎఫ్ ఐ చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం హుస్నాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గజ్వేల్ మోడల్ హబ్ ని ఏర్పాటు చేయాలని అన్నారు. హుస్నాబాద్ లో ప్రభుత్వ ఎస్సీ  పోస్టుమెట్రిక్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ ,జిల్లా సహాయ కార్యదర్శి నాచారం శేఖర్ , సంతోష్, జిల్లా నాయకులు ఆముదాల రంజిత్ రెడ్డి , సుద్దాల భాస్కర్ , భరత్ ప్రశాంత్ మధు ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.