స్టైలిష్‌ గా చిరంజీవి ‘భోళా శంకర్‌’ టీజర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. మాస్‌ యాక్షన్‌ అంశాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో చిరు టాక్సీ డ్రైవర్‌గా మాస్‌  లుక్‌లో కనిపించనున్నారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.