తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల…

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాల విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఆధ్వర్యంలో మే 18న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించినట్టు లింబాద్రి వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీషకు తొలి ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో మెరిశారు.

Spread the love