విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దశాబ్దిది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు రాగిజావను అందించనున్నట్లు తెలిపింది. రోజూ ప్రార్థనా సమయానికి ముందు 250 మిల్లీ లీటర్ల రాగి జావను విద్యార్థులకు అందించనున్నారు. ఈ నెల 20 నుండి రాగిజావ పంపిణీ ప్రారంభం కానుండగా, జులై 1 నుండి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కోడిగుడ్డు అందించే మూడు రోజులు మినహాయించి, మిగతా రోజుల్లో రాగిజావ అందించనున్నారు.

Spread the love