అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ:ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

నవతెలంగాణ-అంబర్‌పేట
అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఎన్నో సం వత్సరాల ఆలు పెరగని పోరాటాల ద్వారానే రాష్ట్ర సాధి ంచుకున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగిం పులో భాగంగా గురువారం అంబర్‌ పేట డివిజన్‌ పరిధిలోని సిద్ధార్థ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, అంబర్‌ పేట కార్పొరేటర్‌ ఇ.విజరు కుమార్‌ గౌడ్‌ హాజరై మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్‌చారికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తొలి, మలి దశ ఉద్యమంలో ఎం దరో తమ అసువులను బాసి తెలంగాణ సాధించారని, తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు బతుకు దెరువు బాగుపడుతుందని ఆశించి ప్రాణాలకు తెగించి పోరాటం సాగించారని అన్నారు. కులమ తా లకు అతీతంగా అన్ని వర్గాలను అభివద్ధి చేయడమే ధ్యే యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు లవంగు ఆం జనేయులు, అమునూరి సతీష్‌, కారంగుల లింగారావు, రంగు సతీష్‌ గౌడ్‌, మల్లేష్‌ యాదవ్‌, మహేష్‌ ముదిరాజ్‌, తిరుపతి, నాగరాజు, శ్రీనివాస్‌ గుప్తా, రంగు ఉదరు కిరణ్‌ గౌడ్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.