తెలుగు టాలన్స్‌ జోరు

– గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై గెలుపు
జైపూర్‌ : ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌)లో తెలుగు టాలన్స్‌ జోరు కొనసాగుతుంది. పీహెచ్‌ఎల్‌లో తెలుగు టాలన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై 40-38తో గెలుపొందింది. స్టార్‌ ఆటగాడు దేవిందర్‌ సింగ్‌ భుల్లార్‌ గోల్స్‌తో మెరువగా, గోల్‌కీపర్‌ రాహుల్‌ మరోసారి అడ్డుగోడ కట్టాడు. ప్రథమార్థంలో 21-19తో ముందంజలో నిలిచిన తెలుగు టాలన్స్‌ ద్వితీయార్థంలోనూ దుమ్మురేపింది. తొలి పది నిమిషాల ఆట మినహా తెలుగు టాలన్స్‌ ఆధిక్యంలోనే కొనసాగింది. గోల్డెన్‌ ఈగల్స్‌ చివర్లో వరుస గోల్స్‌తో పోటీనిచ్చినా.. 40-38తో రెండు గోల్స్‌ తేడాతో తెలుగు టాలన్స్‌ సీజన్లో వరుసగా రెండో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుంది.

Spread the love