నవతెలంగాణ-శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కథువా జిల్లాలో అబ్దుల్ ఖుయ్యుం, ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తులిద్దరూ వేర్వేరు నివాసాల్లో ఉంటున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వారి ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద ఉన్న మహిళలు, చిన్నారులను పోలీసులు వెలికితీశారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, వారిలో ఒకరు బాలుడు ఉన్నాడు.