బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన బీజేపీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్‌ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి, అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్‌ పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బీజేపీ,ఓబీసీ సమ్మేళనం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బీసీ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్ట్టగా బండి సంజరు ఆమోదించారు.

Spread the love