బాలుకు అభిమాన గాయకుల దళం స్వర నీరాజనం

నవతెలంగాణ – హైదరాబాద్: పాడుతా తీయగా టీ.వీ. కార్యక్రమం నుంచి విఖ్యాత గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శనం లో ఎదిగిన గాయనీగాయకులతో పాటు మరెందరో వర్ధమాన గాయకుల పాటలతో శ్రీ త్యాగరాయ గాన సభ సంగీత భరితమైంది. బాలసుబ్రహ్మణ్యం 77 వ జయంతి సందర్భంగా ఆయన అభిమాన గాయకులు దళం స్వర నీరాజనం పది గంటల పైగా సాగింది. గీతా మాధురి,శృతి,గాయత్రి,శ్రీదేవి, హరిప్రియ,రవివర్మ,శ్రీనివాస శర్మ, గోవింద్ ఆచార్య, హరి,శ్రీతేజ ఇలా ఎందరో తమ గళా లతో మధురమైన పాటలు పాడారు. సంగీత దర్శకురాలు ఏం ఏం. శ్రీలేఖ కూడా పాలు పంచు కున్నారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో నూతన సంస్థ డాక్టర్ ఎస్ పీ బి. సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ లోగో ను శ్రీలేఖ అవిష్కరించి మాట్లాడారు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే బాలు ఒక్కడే స్వర మాంత్రికుడు అన్నారు. నటుడు లోహిత్, ఉత్తేజ్, కుమార్,కళాభిమాని కె.కె.రాజా,గీత రచయిత కసర్ల శ్యాం, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంఖ్యా శాస్త్రవేత్త డైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని సంస్థ రూప కర్తలు గోవింద్ ఆచార్య, హరే రాం లను అభి నందించారు. డీ. వీ వీ.ఏస్. నారాయణ సంకలనం చేసిన బాలు గాన రత్నాలు సంపుటి ఆవిష్కరించారు. రాజు ఎంటర్ టైన్స్ డేవిడ్ రాజు,శరత్ అడ్డంకి,సందీప్ రెడ్డి,శ్యాం బాబు సౌజన్యం అందించారు.

Spread the love