రాష్ట్రం ఆవిర్భావం ఎందరో అమరవీరుల స్వప్నం

– మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
– జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ సమావేశంలో తెలంగాణ అమరవీరులకు నివాళి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన అమరవీరులకు నివాళులర్పి ంచారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం నగర మేయర్‌, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకు ంటూ రెండు ఁమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పి ంచారు. నగర మేయర్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎందరో అమరవీరుల స్వప్నం, ప్రజల చిరకాల కోరిక అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం నెరవేరడం కోసం 60 సంవత్సరాలుగా ఈ నేలపై పుట్టిన బిడ్డలు అనేక పో రాటాలు చేశారని తెలిపారు. మొదటి సారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం 1942 నుండి 1948 వరకఁ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న, హ రిజన ముత్తమ్మ, బండి యాదగిరి, షేక్‌ బందగి, సోయబ్‌ ఉల్లా ఖాన్‌ లాంటి ఎందరో వీరులు ఈ నెల కోసం ప్రాణా లు అర్పించారని గుర్తు చేశారు. మళ్లీ 1969లో మొదలైన తెలంగాణ మలిదశ పోరాటం జరిగిందన్నారు. తొలిదశ ఉద్యమంలో తొలి అమరుడు 17 సంవత్సరాల శంకర్‌ అనే విద్యార్థి ప్రాణం త్యాగంతో ఉద్యమం ఎగసిపడి 369 విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేసినా రాష్ట్ర స్వప్నం నెరవేరలేదన్నారు. 2009 నవంబర్‌ 29న నాటి ఉద్యమ నాయకఁడు నేటి కేసీఆర్‌ ఆమరణ నిరా హార దీక్ష తో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకుందన్నారు. ప్రజా ఉద్యమ త్యాగాల ఫలితంగా కేసీఆర్‌ నాయ కత్వంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం కోసం మలిదశలో ప్రాణాలర్పించిన తొలి అమరు డు శ్రీకాంతాచారి అన్నారు. తెలంగాణ ప్రగతి కాంతులతో మీ త్యాగమే ప్రతిఫలిస్తున్నది..అమరులారా మీకుజోహార్లు అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌ కఁమార్‌, ఈ.వీ.డీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక అలా, జోనల్‌ కమిషనర్లు మమత, శ్రీఁవాస్‌, పంకజ, శ్రీనివాస్‌ రెడ్డి, శంకరయ్య, సీసీపీ దేవేందర్‌ రెడ్డి వివిధ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love