తండాలలో ఘనంగా తీజ్ పండగ..

– సుఖసంతోషాలతో పండుగలు చేస్కోవాలి..
– మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి తండా,రంజీత్ నాయక్ తండా,గండి తండలలో మహిళలు తీజ్ పండగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు,బోగ్ బండర్ లో పాల్గోన్నారు. తండాల చిన్న పెద్ద అందరు జగదంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో కి వెళ్లి ప్రత్యేక పూజలు కలిసి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం గిరిజన మహిళలు తీజ్ నిమజ్జనం సంప్రదాయ పద్ధతిలో చేసుకుంటారని పెల్లి కానీ ఆడ పిల్లలు మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు.సుఖసంతోషలతో పండుగలు జరుపుకోవలని, ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు కమ్యునిస్టు హల్,సిసి రాహదరికి డ్రైనేజ్ కి నీధులను మంజూరు చేశానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తండా అభివృద్ధి కి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, సంతోష్ రెడ్డి, నారాయణ నాయక్,రత్తు నాయక్,ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, బైరయ్య,తండా పేద్ద శంకర్,
రంజీత్ నాయక్ తండాలో..
హిరబాయి సితరం అధ్వర్యంలో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఇందల్ వాయి సహకార సొసైటీ వైస్ చైర్మన్ మారుతి నాయక్, తండా పేద్దలు అంబర్ సింగ్, రాజు రంగి, లక్ష్మన్,రతన్,చందర్ పూజారి,మనోజ్ నాయక్ తోపాటు తండా వాసులు పాల్గొన్నారు.
Spread the love