గుంతల మయమైన రోడ్డుకు మరమ్మత్తులు పరిశీలించిన నాయకులు

నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ మండల కేంద్రంలో హైవే రోడ్డు అద్వాన్న పరిస్థితిగా మారిందని గుంతల మయంగా మారిన రహదారి గుండా వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారిందని ప్రజల ఆరోపణ పట్ల పత్రికల్లో వచ్చిన వార్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే స్పందించారు. మండల కేంద్రంలో గుంతల మాయమైన రోడ్డు మరమ్మత్తులకు సిమెంటు కాంక్రీట్ ద్వారా పూడ్చివేత కార్యక్రమాలను మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ వీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీ పటేల్ బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ కు మరమ్మత్తుల నిధుల గురించి అడిగి తెలుసుకోగా రోడ్డు మదనమ్మత్తుల పనులు ఎమ్మెల్యే కృషితో జరుగుతున్నాయని పంచాయతీ నిధులు కావని తెలిపారు పాత బస్టాండు పోలీస్ స్టేషన్ సోనాల చౌరస్తా వరకు పెద్ద పెద్ద పూజలను సిమెంటు కాంక్రీట్తో పూడ్చివేత కార్యక్రమాలు చేపట్టారు గుంతలు పూడ్చినందుకు  ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love