గ్రామాల అభివృద్దే ధ్యేయం..

– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి అని గ్రామాలలో అవసరాల మేరకు నిధులను మంజూరు చేస్తూ గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తూన్నమని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ మ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ₹ 5 లక్షల రూపాయలు, ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ₹ 5 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రోసిడింగ్ పత్రాలను కులాల సంఘ సభ్యులకు రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, కులాల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love