మహిళల నగ్న ఊరేగింపు మానవ జాతికే మాయని మచ్చ: గోకినపల్లి

నవతెలంగాణ – అశ్వారావుపేట
మణిపూర్ లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించడం మానవ జాతికే మాయని మచ్చ అని సీపీఐ ఎం ఎల్ ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ ఆవేదన వెలిబుచ్చారు.హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.
మణిపూర్ లో జరిగిన అమానుష సంఘటన పై శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు బాడిస లక్ష్మణ్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన  నిరసన సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో నల్ల రిబ్బన్ లతో  నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు, పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు గోకినపల్లి గంగ, తదితరులు ప్రసంగిస్తూ మణిపూర్ రాష్ట్ర ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి, హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.మణిపూర్ మూడు నెలలుగా కుకీ లకు, మైతీ లకు మధ్య జరుగుతున్న వివాదం మోడీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అని, గిరిజన మహిళలను నగ్నంగా సభ్య సమాజం సిగ్గు పడేలా ఊరేగించి అత్యాచారం చేయటం,హత్య చేయటం అనేది ప్రపంచంలో భారత్ సిగ్గుతో తలదించుకునే సంఘటనగా వర్ణించారు.  ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మోడీ తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్మణిపూర్ లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించడం మానవ జాతికే మాయని మచ్చ అని సీపీఐ ఎం ఎల్ ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి చేశారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల కార్యదర్శి కుంజా అర్జున్, కాక బాబురావు, జెడ్డి నారాయణ, తెల్లం సత్యం,కాక లక్ష్మణ్ రావు, కారం వెంకటేష్, కూరం రాము, పి ఓ డబ్ల్యు మండల నాయకులు కబ్బాడి కవిత, జోడె ముత్తమ్మ సన్యాసి ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.