
– ఆ ఊరికి ఆటోలు నడవయి టూ వీలర్లు వెళ్ళవు కాళ్ల నడుపు నడవరాదు మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని రాచూర్ గ్రామ ప్రజల గోస పట్టేది ఎవరికి ఈ గ్రామానికి జాతీయ రహదారికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. మట్టి రోడ్డుతో నడవలేని పరిస్థితి. ఈ గ్రామానికి ఆటోలు రావు టూ విల్లర్లు నడిపే పరిస్థితి లేదు. కాళ్లతో వెళ్లాలన్న బురదలో వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి గల రాచూరు గ్రామ ప్రజల గోస ఏ ఒక్క ప్రజాప్రతినిధికి పట్టింపు లేకపోవడం భారతదేశనికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన మూడు కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి చేయడంలో అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం బంగారు తెలంగాణ అభివృద్ధి అంటే ఇదేనా అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం అవుతుంది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాచూరు గ్రామ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆ రోడ్డు గుండా నడవలేని పరిస్థితి. అయ్యో రామచంద్ర అన్న కూడా వెళ్లలేని పరిస్థితి అత్యవసర పనిలో భాగంగా ట్రాక్టర్ ఇంజన్ పైన వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్ తప్ప ఇతర ఎలాంటి వాహనాలు ఈ రోడ్డు గుండా నడవలేని పరిస్థితి. ప్రస్తుతం బురదమయంగా మారిన రోడ్డులో అధికారులు ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి వెళితే ఆ గ్రామ ప్రజల గోస ఎలాంటిదో అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో మా గ్రామానికి ప్రజా ప్రతినిధులు అధికారులు రావాలని తిప్పలేమిటో తెలుస్తుందని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి 75 సంవత్సరాలు పట్టిన జరగాని పని ఆ గ్రామ ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు నానా తిప్పలు పడవలసిందే. ఇలాంటి పరిస్థితి రాచూరు గ్రామస్తులు ఎదుర్కొంటుంటే ఆ గ్రామ ప్రజల గోస ప్రభుత్వానికి పట్టింపు రావడంలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా ఇబ్బందులు దూరం కావడానికి రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.