భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

gold-and-silver-prices-rose-marginallyనవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత రెండు నెలల్లో ఎప్పుడు లేనంతగా గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.60,650కి చేరుకుంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.400 పెరిగి రూ.78,4000గా ఉంది.