బస్సుల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
సరైన సమయంలో బస్సులు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమయానికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (మానవ హక్కుల సంస్థ) ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎంపీపీ, జడ్పీహెచ్ఎస్, అంగన్వాడి హద్దుల వివరాలు, ఇతర వివరాలు డి ఈ ఓ కు ఆర్టిఐ ద్వారా సమాచారం కోరడం జరిగిందని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ ఎల్లప్పుడూ ముందుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు విఠల్, కరీముద్దీన్, లింబద్రి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love