ఈటల రాజేందర్ కు భద్రత కల్పించనున్న రాష్ట్ర ప్రభుత్వం…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసింది, ఈ విచారణలో ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందని నిరాదరణ అయినట్లు తెలిసింది. ఈ రిపోర్ట్స్ తర్వాత ఈటలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉంది. ఈ మధ్యనే ఈటల రాజేందర్ నా హత్యకు కుట్ర జరుగుతోంది అని మీడియా ముఖముగా చెప్పడంతో.. కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. డీజీపీకి చెప్పి విచారణ చేయమని చెప్పడంతో ఈ ఉదయమే మేడ్చల్ డీసీపీని ఈటల ఇంటికి పంపించారు, ఈటల డీసీపీ సందీపరావు తో కొద్ది రోజుల నుండి అనుమానాస్పదంగా కార్లు తిరుగుతున్నాయన్నారు. అలా పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేయడంతో నిజమే అని తేలింది. ఇప్పుడు ఏ క్షణం అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈటలకు భద్రత కల్పించవచ్చు.

Spread the love