పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ

పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం. కాని సమాజంలో పోలీసులంటే చిన్నచూపు ఉంది. దానికి కారణం సామాన్యులలో భయమైతే, .రాజకీయనాయకులకు లెక్కలేనితనం. అయితే చట్టం ఎవరి చుట్టం కాదని.. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథే ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌’.
శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో సీహెచ్‌వీ సుమన్‌ బాబు పోలీస్‌ ఆఫీసర్‌గా నటించగా, రఘుబాబు, అజరు ఘోష్‌, అదుర్స్‌ రఘు, గీతాసింగ్‌, నాగమహేష్‌, నవీనా రెడ్డి, రామ్‌, అబ్దుల్‌, రాఘవ శర్మ తదితరులు ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. ‘శక్తివంతమైన కథతో రూపొందిన సినిమా ఇది. ఆగస్ట్‌ 15 ఇండిపెండెన్స్‌ రోజున ఫస్ట్‌ గ్లిమ్స్‌ రిలీజ్‌ చేస్తాం. డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అలరిస్తూనే ఆలోచించేలా కథాకథనాలు ఉంటాయి’ అని దర్శకుడు సీహెచ్‌వీ సుమన్‌ బాబు చెప్పారు.హైదరాబాద్‌, అనంతపూర్‌, కర్ణాటక తదితర ప్రాంతాలలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: అబ్దుల్‌ రెహమాన్‌.

Spread the love