పట్టపగలు నడిరోడ్డులో యువతిపై దారుణం..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ యువతి పట్ల ఓ యువకుడి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలిలో చోటు చేసుకుంది. ఆ వీడియో స్థానికంగా రద్దీ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు బురఖా ధరించిన యువతిని వెంటబెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంటాడు. సడన్‌గా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన అతను ఆమెపై దాడికి దిగాడు..కొట్టుకుంటూ అటు ఇటు లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు.  అ యువతి వేడుకుంటున్నా.. వదలకుండా ఎవరికో ఫోన్ చేశాడు..ఓ ఆటో అక్కడికి వచ్చాక ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. తర్వాత ఆమెను ఏం చేశాడన్నది తెలియరాలేదు. కాగా, వీడియో వైరల్ అవడంతో రాయబరేలీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పట్టపగలు ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం అని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.