18 ఏళ్ళు దాటిన వారు ఓటరు నమోదు చేసుకోవాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
18 ఏళ్ళు దాటిన వారు ఓటరు నమోదు చేసుకోవాలని, ఆగస్టు 21డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేలువడుతుందని నియోజక వర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్ రెడ్డి, దర్పల్లి ఎంపిడిఓ లక్ష్మణ్ అన్నారు.స్పేషల్ సమ్మరి రివిజన్ లో బాగంగా భారత ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు డిచ్ పల్లి మండల కేంద్రంలోని మానవత సదన్ లో, ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బుత్ లెవెల్ అధికారులకు గురువారం ఒక్కరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18ఏళ్ళు నిండిన వారికి ఓటర్ గా నమోదు చేసే విధంగా చూడాలని, ఓటర్ లిస్టులో ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులు నింపే నప్పుడు జాగ్రత్తగా చుసుకోవలని సూచించారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, టివి రోజా, మండల రెవెన్యూ అధికారి మోహమ్మద్ వాహిద్, శ్రీకాంత్, ఎఎస్ఓ రాజీవ్, కార్యదర్శి తిరునగరి శ్రీదర్ తోపాటు బిఎల్ఓలు, సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love