కూలిన సర్పంచ్ ఇంటిని పరిశీలించిన వడ్డీ మోహన్ రెడ్డి

మోకన్ పల్లి సర్పంచ్ రొడ్డ సుధాకర్ పెంకుటిల్లు
మోకన్ పల్లి సర్పంచ్ రొడ్డ సుధాకర్ పెంకుటిల్లు
నవతెలంగాణ-నవీపేట్:
మండలంలోని మోకన్ పల్లి సర్పంచ్ రొడ్డ సుధాకర్ పెంకుటిల్లు వర్షానికి కూలిపోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రొడ్డ సుధాకర్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహకారాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షానికి నిరుపేదల ఇండ్లు కూలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసనగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love