ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తాన్ని అందజేత..

నవతెలంగాణ- తాడ్వాయి
ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తాన్ని అందజేత. ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు. హైదరాబాదులోని నిమ్స్ వైద్యశాలలో రాజమండ్రి చెందిన సాయికి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఐవీఎఫ్ యూత్ రాష్ట్ర సెక్రెటరీ వీరేందర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్ విజయవంతం అయ్యేలాగా కృషి చేయడం జరిగిందని ఐ.వి.ఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. సకాలంలో రక్తాన్ని అందజేసిన రక్తదాత వీరేందర్ కు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు.