ఆర్థిక అక్షరాస్యత పై శిక్షణా కార్యక్రమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో శుక్రవారం ( ఆర్థిక అక్షరాస్యత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కామరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ కృష్ణ, సెర్ప్ డైరెక్టర్ సురకం శ్రీనివాస్, వెంకట్ లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని దాదాపు 70 మంది సిఎ లను ఎంపిక చేయడం జరిగిందని, ఇలాంటి శిక్షణ లను సద్వినియోగం చేసుకోని మరింత సమాచారాన్ని ఇవ్వాలన్నారు. వెంకట్ మాట్లాడుతూ శిక్షణ యొక్క విధి విధానాలను ఈ శిక్షణను గ్రామ సంఘం సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ భాగ్యలక్ష్మి, రామకృష్ణ, రజితా, నవీన్ పాల్గొన్నారు.