అధికారులకు బదిలీలు తప్పని సరి

– బండ్లగూడ కమిషనర్‌ను సన్మానించిన నాయకులు
– కొత్త కమిషనర్‌కు స్వాగతం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌
నవతెలంగాణ-గండిపేట్‌
అధికారులకు బదిలీలు సహాజమని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి బదలీపై వేళ్లారు. కార్పొరేషన్‌ పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో కమిషనర్‌ విడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు సర్వసాధరణమని తెలిపారు. పాత కమిషనర్‌కు విడ్కోల్‌ పలుకుతూ వికారాబాద్‌ నుంచి వచ్చిన కొత్త కమిషనర్‌ శరత్‌ చంద్రకు స్వాగతం పలికారు. కార్పొరేషన్‌ అభివృద్ధికి కమిషనర్‌గా సేవలందించినందుకు పాలక వర్గ సభ్యులు ఘనంగా సన్మాణించారు. కార్యక్రమంలో కమిషనర్‌ శరత్‌ చంద్ర, మేయర్‌ మహేందర్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు తలారి చంద్రశేఖర్‌, కార్పొరేటర్లు సాగర్‌ గౌడ్‌, ముద్దం రాము, శ్రీనాథ్‌రెడ్డి, సంతోషిరాజీరెడ్డి, అస్లాంబీన్‌, భూపాల్‌ గౌడ్‌, ప్రశాంత్‌నాయక్‌, నాయకులు నాగరాజు, టీంకురెడ్డి, పాపయ్యయాదవ్‌, ప్రేంకుమార్‌ గౌడ్‌, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love