బీఆర్ఎస్ అధికారంలోనే నిరంతర విద్యుత్ సరఫరా 

– దాచారం రైతు తీర్మానంలో ఎమ్మెల్యే రసమయి 
– ముధిరాజ్ సంఘ భవన ప్రారంభం
నవతెలంగాణ-బెజ్జంకి 
బీఆర్ఎస్ అధికారంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరావుతూ రైతుల కలలు నెరవెరుతాయని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల విధ్యుత్ సరఫరా చాలంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల పరిధిలోని దాచారం రైతు వేదిక యందు రైతులు చేసిన తీర్మాణానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరయ్యారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘ భవనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కవిత, సర్పంచులు పెంటమీదీ శ్రీనివాస్, కనగండ్ల రాజేశం, టేకు తిరుపతి, బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, రైతులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతమన్న మాటలు ఉత్తవే..
ఎన్నికల వరకే రాజకీయాలని.. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా సహకరించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన వాఖ్యలు ఉత్తవేనని దాచారం ఎంపీటీసీ కొలిపాక రాజు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘ భవన ప్రారంభంలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీటీసీని విస్మరించడం రాజకీయాలకు అతిథ్యమివ్వడమేనని ప్రజాప్రతినిధుల తీరును ఎంపీటీసీ రాజు ఖండించారు. స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకుల దగ్గర విజ్ఞానంతో సాధించుకున్న అధికారాన్ని సంబధిత అధికార యంత్రాంగం తృణంగా పెట్టారని రాజు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విస్మరించడంలో అధికార యంత్రాంగం వ్యవహరచిన తీరుపై జిల్లా పరిపాలనాధికారికి పిర్యాదు చేయనున్నట్టు రాజు తెలిపారు.