విప్లవ వీరుని విగ్రహం వద్ద మూత్రం

– పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
– విచారణ హామీతో రాస్తారోకో విరమణ
నవతెలంగాణ -గజ్వేల్‌
విప్లవ వీరుని విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశారని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో మరో గ్రూపు రాస్తా రోకోకు దిగింది. సోమవారం రాత్రి గజ్వేల్‌ పట్టణంలోని పిడిచేడు రోడ్డులో ఉన్న విప్ల వ వీరుని విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని చూసిన స్థానికులు ఆయ న్ను పట్టుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి, సీఐ వీరప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. మూత్ర విసర్జన చేసిన అతనిపై విచారించి కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కాగా, మూత విసర్జన చేసిన వ్యక్తి మద్దతుదారులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీఐ వీర ప్రసాద్‌ను కలిసి సమస్యను వివరించారు. అరెస్టు చేసిన వ్యక్తిని వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశా రు. రెండు గ్రూపులు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love