నవతెలంగాణ – భువనేశ్వర్
ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు అదనపు సబ్ కలెక్టర్ గా ప్రశాంత్ కుమార్ రౌత్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రశాంత్ కుమార్ రౌత్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారనే వున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామునే భువనేశ్వర్ లోని ఆయన నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దాంతో, ప్రశాంత్ కుమార్ రౌత్ రూ.2 కోట్ల నగదును పొరుగింటి టెర్రస్ పైకి విసిరేశాడు. ఈ విషయాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు పక్కింటి టెర్రస్ పైకి వెళ్లి 6 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నగదు కట్టలను గుర్తించారు. కాగా, ప్రశాంత్ కుమార్ రౌత్ అవినీతిపై ఉప్పందుకున్న విజిలెన్స్ విభాగం ఏకకాలంలో 9 చోట్ల దాడులు జరిపింది. భువనేశ్వర్ లోని నివాసంతో పాటు, నబరంగ్ పూర్ లోని మరో ఇంటిలోనూ, ఆఫీసులోనూ, భద్రక్ జిల్లాలోని తల్లిదండ్రుల నివాసంలోనూ, ప్రశాంత్ కుమార్ కు చెందిన మరో 9 ప్రదేశాల్లోనూ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే నబరంగ్‌పుర్‌లోనూ మరో రూ.77 లక్షలు పట్టుబడ్డాయి. మొత్తంగా రూ.3 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
విజిలెన్స్ దాడులకు భయపడి.. పక్కింటిపై డబ్బులు విసిరిన అదనపు సబ్ కలెక్టర్
6:53 pm