జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీలలో విజయ్ విద్యార్థినిలు

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఫుట్బాల్ -2023 పోటీలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మే 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు జరిగాయి అని విజయ్ హై స్కూల్ కరస్పాండెంట్ ప్రభాదేవి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో విజయ్ హైస్కూల్, నిజామాబాదుకి చెందిన 8వ తరగతి విద్యార్థిని సిహెచ్. జాహ్నవి, 7వ తరగతి విద్యార్థిని సిహెచ్. హరిణిలు తృతీయ స్థానంలో నిలిచి కాంస్యపతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ వ్యవస్థాపకులు డా.అమృతలత, కరస్పాండెంట్ ప్రభాదేవి, అకడమిక్ డైరెక్టర్ టి.వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పీ.సుజాత, ప్రిన్సిపాల్ విజేతలు, అధ్యాపక బృందం విద్యార్థినిలు ఇద్దరినీ అభినందించారు.

Spread the love