సిఐగా పదోన్నతి పొందిన సాయికుమార్ గౌడ్ కు గ్రామస్థుల సన్మానం

 గ్రామస్థులు సన్మానం చేస్తున్న దృశ్యం
గ్రామస్థులు సన్మానం చేస్తున్న దృశ్యం
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రానికి చెందిన సాయికుమార్ గౌడ్ నిజామాబాద్ 6వ టౌన్ లో  సబ్ ఇన్ స్పేక్టర్ గా విధులు నిర్వహించి సిఐగా పదోన్నతి పొందిన సందర్భంగా గ్రామస్థులు ఆదివారం ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా మాక్లూర్ గ్రామం నుంచి ఒక్క వ్యక్తి ఉన్నత స్థానాలకు వెళ్ళడం గ్రామస్థులకు, గ్రామానికి మంచి పేరు వస్తుందని గ్రామస్థులు అన్నారు. అలాగే మరెన్నో ఉన్నత స్థానాలకు సాయికుమార్ గౌడ్ ఎదగాలని గ్రామానికి మంచి పేరు తీసుక రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Spread the love