Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు.

హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌ది అహంకార, కుట్ర యాత్ర అని, సంజయ్‌కు దమ్ముంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయించాలని, ఆ తర్వాత యాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈడీ (ED), ఐటీ (IT) దాడులతో సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబం సహా, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ (BJP) కుట్రలను తిప్పికొడతామన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని, నవంబర్ 29న (రేపు) దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. మంగళవారం నుంచి డిసెంబర్ 9వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

party logovotes
1000
800
700

ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో కమల వికాసం కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నట్లుగా తాజా ఎన్నికల ఫలితాల బట్టి తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలలో పోటీ చేసిన టీడీపీ ఖాతా తెరవలేదు . కనీసం ఒక్క చోట కూడా ఆధిక్యం ప్రదర్శించలేదు . గత దుబ్బాక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తోంది.